ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు పశ్చిమాన జైటోమిర్ ప్రాంతంలో గాలిలో ఎగురుతున్న రెండు ఎల్-39 శిక్షణా విమానాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉక్రెయిన్ పైలెట్లు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు మిలటరీ పైలట్లలో ఉక్రెయిన్ ఆర్మీ ఆఫీసర్ ఆండ్రీ పిల్షికోవ్ ఉన్నారు. తాను దేశానికి ఎంతో అంకితభావంతో సేవ చేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు జెలెన్స్కీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.