తాడేపల్లి బైపాస్ రోడ్డు వీఆర్ అపార్ట్మెంట్స్ వద్ద జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే శనివారం రాత్రి పరిశీలించారు. పదిరోజుల క్రితం అపార్ట్మెంట్ వాసులు రోడ్డుసమస్య ఉందని సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యే ఆర్కే కి తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ఆ రోడ్డు పరిశీలించి రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. మాట ప్రకారం 10 రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించారు.