అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై కేసునమోదైంది. గుంటూరు నగరం ముత్యాలరెడ్డినగర్లో నివసించే జి. చంద్రహాసన్ (32) గతంలో పట్టాభిపురం పరిధిలో చికెన్ వ్యాపారం నిర్వహించేవాడు. కొద్దిరోజులకు అప్పులు పాలయ్యాడు. అవి తీర్చలేక నిత్యం మనస్తాపానికి గురై బాధపడుతుండేవాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.