కోడలిపై కన్నేసిన భర్తను భార్య గొంతు కోసి చంపేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. బదాయూ పట్టణానికి చెందిన తేజేంద్ర సింగ్ తాళ్ల వ్యాపారి. ఇతడికి నలుగురు సంతానం. అయితే ఇటీవల కోడలిపై మనసు పారేసుకున్నాడు. ఆమెతో లైంగిక సంబంధానికి ఒప్పించాలని భార్య మిథిలేశ్ దేవిని వేధించేవాడు. తరచూ కొట్టేవాడు. దాంతో విసిగిపోయిన మిథిలేశ్ దేవి గాఢ నిద్ర నిద్రలో ఉన్న తాజేంద్ర సింగ్ను కొడవలితో గొంతు కోసి హత్య చేసింది.