వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎంపీ రాహుల్ గాంధీనే అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ‘ఇండియా’ కూటమిలో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక బీజేపీ గురించి ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ అహంకారంతో వ్యవహరించకూడదని.. ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీజేపీ 31 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. మిగిలిన 69 శాతం వ్యతిరేకమని చెప్పారు.