విద్యార్థులకు సీఎం జగన్ గుడ్న్యూస్ చెప్పారు. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి మూడో త్రైమాసికం నిధులను సీఎం జగన్ రేపు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగే బహిరంగ సభలో బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుండగా, దాదాపు 9.80 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.