తెనాలి పట్టణానికి చెందిన మీసాల జ్యోతిప్రసన్నకుమార్ ఈ నెల 18న వ్యక్తిగత పనులపైవెళ్లి వస్తున్న క్రమంలో పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం సమీపంలో ఆవు అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడ్డారు. గమనించిన స్థానికులు108లో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గత శుక్రవారం మరణించాడు. శనివారం తండ్రి అప్పలనాయుడు శనివారంఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు.