అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో దారుణం చోటు చేసుకుంది. సిల్చార్ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో అనుమానాస్పద స్థితిలో బాలుడి (10 ఏళ్లు) మృతదేహం లభించింది. మృతుడి తల్లి ఎంపీ ఇంట్లో గత రెండున్నర ఏళ్లుగా డొమెస్టిక్ హెల్పర్‌గా పని చేస్తోంది. బాలుడు ఐదో తరగతిలో చదువుతున్నాడు. బాలుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎంపీ రాజ్‌దీప్ తెలిపారు. అయితే ఇది హత్య? లేదా ఆత్మహత్యా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.