ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు వారాల్లోనే సీన్ మొత్తం రివర్స్,,,ఏపీలో దారుణంగా పడిపోయిన టమాటా ధరలు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 27, 2023, 09:10 PM

ఏపీలో టమాటా ధరలు మరీ దారుణంగా పడిపోయాయి. రెండు నెలలుగా భారీగా పెరిగిన ధరలు.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమాటా ధరలు దిగి వచ్చాయి. రైతులు తొలిరోజే సుమారు 10 టన్నుల సరకు మార్కెట్‌కు తెచ్చారు. వేలంలో క్వింటాలు టమాటాకు రూ.వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. అంటే.. కిలోకు రూ.10 కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వల్ల ధరలు పతనం అవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఇటు మదనపల్లెతో పాటుగా అనంతపురం జిల్లాలోని మార్కెట్‌లో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మార్కెట్‌లలో మాత్రం కిలో టమాటాకు రూ.30-40 వరకు నడుస్తోంది.


జులై నెలలో టమాటాల ధరలు ఆకాశాన్ని తాకాయి. కేజీ రూ.50 నుంచి మొదలై.. రూ.100, ఆ తర్వాత రూ.150 నుంచి ఏకంగా రూ.200 కు పెరిగింది. అయితే జులై నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారంలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ధరలు మెల్లిగా పడిపోతూ వచ్చాయి.. ఇప్పుడు దారుణంగా రూ.10కు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మొన్నటి వరకు లాభాలు కురిపించిన టమాటా ధరలు ఇప్పుడు ఊహించని రీతిలో పడిపోయాయి అంటున్నారు. గతంలో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు చూశాం. ఎన్నో సందర్భాల్లో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పడేసిపోయిన ఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి కేజీ రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు పలికాయి.. పంటను తీసుకొచ్చిన వాహానికి బాడుగకు కూడా డబ్బులు వచ్చేవి కాదు. కానీ జూన్, జులై నెలల్లో మాత్రం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో కొందరు రైతులు కోట్లలో ఆదాయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ పాత పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com