ధాన్యం కొనుగోళ్లపై కొన్ని పత్రికలూ తప్పుడు రాతలు రాస్తున్నాయని, చంద్రబాబు హయాంలో కంటే వైయస్ జగన్ నాలుగేళ్ల పాలనలోనే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశారని, ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వంపై ఈనాడు రామోజీరావు నిత్యం విషం చిమ్ముతున్నాడని, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు.