చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన నేపథ్యంలో ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలు చంద్రుడిపై తమ హక్కును చాటుకునే లోపే చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ల్యాండర్ దిగిన ప్రాంత్రాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.