కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల ఊటీలోని మోడీస్ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ అంతా మహిళలే నిర్వహిస్తున్న తీరును చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ సిబ్బందిని అడిగి చాక్లెట్ల తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం తాను కూడా కొన్ని చాక్లెట్లను తయారుచేశారు. మురళీధర్ రావు, స్వాతి అనే స్ఫూర్తిదాయక దంపతులు ఈ ఫ్యాక్టరీ స్థాపన వెనుక కీలకపాత్ర పోషించారని రాహుల్ వెల్లడించారు.