అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాజస్థాన్ కోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. మహారాష్ట్రకు చెందిన ఆవిష్కార్ అనే విద్యార్థి ఆదివారం కోచింగ్ సెంటర్ బిల్డింగ్ 6వ అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ ఏడాది విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 22కి చేరింది. ఒత్తిడి భరించలేకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.