సమస్యల పరిష్కారానికి రాజీయే రాజ మార్గం అని అనకాపల్లి జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి. గంగరాజు అన్నారు. మండల న్యాయ సేవా అధికార సంస్ధ సంయుక్త నిర్వహణలో ఆదివారం శ్రీ గౌరీ గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూఏ సమస్య నైనా రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని అందుకు లోక్ అదాలత్ దోహద పడుతుందన్నారు. జడ్జిలు బి. వి. విజయలక్ష్మి, ఎం. శివకిరణ్లు గ్రంథాలయ కార్యదర్శి వెంకటరమణ పాల్గొన్నారు.