ఎనిమిదేళ్ళ చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రెడ్డి కంచరపాలెంలో నివాసం ఉంటున్న పోలరెడ్డి(57) అదే ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న ఎనిమిదేళ్ళ చిన్నారిపై ఆదివారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి తండ్రికి రెండు కాళ్ళు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటాడు. తల్లి సింధియా దగ్గర చెత్తలు ఏరుకుంటూ ఉంటుంది.