అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తెలిపారు. కుప్పం, పలమనేరు టీంలు జరిపిన సోదాల్లో నింధితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 140 ఎన్ఎపిఎల్ మద్యం టెట్రా పాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠినమైన కేసులు నమోదు చేస్తామన్నారు.