నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ పక్కన మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....... పల్లెల నుంచి పనుల మీద పట్టణానికి వచ్చే పేదల కోసం ఆహా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్యాంటీన్ ద్వారా రూ.25లకే మినీమీల్స్ రూపంలో వెజ్, కరేపాకు, సాంబారు, లెమన్, ఆవకాయరైస్, పెరుగన్నంను అందిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ ఈ కిరణ్, సీఎంఎం భారతి, వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, గ్రంధం ప్రసన్నాంజనేయులు, కుందుర్తి శ్రీనివాసులు, నున్నా మురళి తదితరులు పాల్గొన్నారు.