కర్నూలు జిల్లా, పత్తికొండను కరువు మండలంగా ప్రకటించి రైతులని ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహిస్తున్నామని, రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షకార్యదర్శులు కారన్న, ఈరన్న పిలుపునిచ్చారు. వారు విలేకరులతో మాట్లాడుతూ..... అరకొర వర్షాలకు ఖరీ్‌ఫలో వివిధ పంటలను రైతులు అప్పులు చేసి సాగు చేశారన్నారు. పంటలు సాగు చేసినప్పటి నుంచి సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ వాడుముఖం పట్టాయన్నారు. ప్రభుత్వం, అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు పార్టీలకతీతంగా రైతులు తరలిరావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa