ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సవాల్ విసిరారు. ఆదివారం ఒంగోలు నగరం ఇస్లాంపేటలో గల కమ్యూనిటీ హాలులో ముస్లింల ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచి, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ముస్లింల సంక్షేమం కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రంజాన్ తోఫా, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వా రా రుణాలు, దుల్హాన్, షాదీఖానా నిర్మాణం, ముస్లిం కమ్యూనిటీ హాల్స్, ఈద్గా అభివృద్ధితో పాటు అనేక సంక్షేమం, అభివృద్ధి పథకాలు చేపట్టామన్నా రు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ముస్లింల సంక్షేమం కోసం పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు.