రాచర్ల పోలీస్ స్టేషన్ లో సోమవారం రాచర్ల మండలం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఫిర్యాదు చేశారు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఎవరిపై ఎక్కువ కేసులో ఉంటే వారికి నామినేట్ పదవులు ఇస్తారని చెప్పటం గొడవలకు దారి తీసేలా ఉందని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కన్వీనర్లు అన్నారు. లోకేష్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.