రైతులు తాము పండించిన పంటలకు ఈ-క్రాప్ చేయించుకోవాలని జరుగుమల్లి మండల వ్యవసాయ అధికారి యుగంధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఏవో కార్యాలయంలో మాట్లాడుతూ దీనివల్ల ప్రభుత్వ రాయితీలు, పంట నష్టపరిహారం, పంట విక్రయం వంటి ప్రయోజనాలను రైతులు పొందుతారని చెప్పారు. ఈ ఏడాది ఈ-క్రాప్ బుకింగ్‌లో ప్రభుత్వం కొత్త మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. రైతులు రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్లి ఈక్రాప్ చేయించుకోవాలన్నారు.