అనంతపురం జిల్లాలో ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ సెల్ టవర్ ఎక్కాడు. పుట్లూరు మండలం ఏ కొండాపురంకు చెందిన ఆర్ఎంపీ వెంకటేష్.. గతంలో లక్కీ డిప్ పేరిట మోసపోయానని పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు న్యాయం చేస్తామని చెప్పి పట్టించుకోవడం లేదంటూ సెల్ టవర్ ఎక్కాడు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఇక్కడ నుంచి సెల్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. వారు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు వెంకటేష్ సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు.
ఆన్‌లైన్ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్నో సందర్భాల్లో పోలీసులు హెచ్చరించారు. అయినా సరే చాలామంది మోసపోతూనే ఉన్నారు. లక్కడి డిప్, ఆన్‌లైన్ పెట్టుబడి, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు, బ్యాంక్ వివరాలు అప్డేట్ చేయాలంటూ ఎన్నో మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. ఇలాంటి సైబర్ మోసాల విషయంలో అప్రమత్తత అవసరం అంటున్నారు. మొబైల్‌కు వచ్చే మెసేజ్‌లు, అనుమానాస్పదంగా ఉండే లింకుల విషయంలో అలర్ట్‌గా ఉండాలంటున్నారు. ఆ లింకుల్ని అసలు క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు.