బడిఈడు పిల్లలందరూ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ కీర్తి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు పట్టణంలోని జిఎంసి కౌన్సిల్ హాల్లో నగరంలో బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్చే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నగరంలోని 5 ఏళ్ల నుండి 18 ఏళ్లలోపు పిల్లలు బడికి వెళ్లని వారి వివరాలు ఎడ్యుకేషన్ సెక్రెటరీల ద్వారా సేకరించాలని, నోడల్ అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa