స్పందన కార్యక్రమానికి హాజరయ్యే ఏ ఒక్కరు కూడా మధ్యాహ్న సమయంలో ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం భోజనాన్ని అందజేస్తున్నారు. వివిధ మండలాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు ఫిర్యాదుదారులు వస్తుండడంతో వారికోసం ప్రత్యేకంగా భోజనాన్ని ఏర్పాటు చేసి అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు పోలీసులు చేస్తున్న ఈ సహాయాన్ని ప్రశంసిస్తున్నారు.