సత్తెనపల్లి పట్టణంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య పిలుపునిచ్చారు. విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలు గుంటూరు పట్టణంలోని బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని పుతుంభాక భవన్లో సోమవారం నిర్వహించారు.