గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సాగు కొంత మేరకు ఊపందుకుంది. పల్నాడు జిల్లా కంటే గుంటూరు జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా ఉండటం, కాల్వలకు అవసరం మేరకు నీరు రావడం వల్ల వరినాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో 3. 25 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటివరకు 1. 85 లక్షల ఎకారాల్లో వివిధ రకాల పైర్లు వేశారు. 1. 66 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు 1. 25 లక్షల ఎకరాల్లో సాగైంది.