తన సోదరిపై వేధింపులు అడ్డుకున్న సోదరున్ని కొట్టి చంపిన ఘటన యూపీ ప్రయాగ్ రాజ్ జిల్లాలో జరిగింది. ఖేరీ పరిధిలో ఉంటున్న కిశోర్ సోమవారం తన సోదరితో పాఠశాలకు వెళ్లాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా, తోటి విద్యార్థులతో గొడవ పడగా సోదరి అడ్డుకుంది. ఈ క్రమంలో వేధింపులకు పాల్పడగా సోదరునిపై దాడికి దిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.