అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశానికి రక్షణ కవచంలా ఉండే సరిహద్దుల విషయంలో బైడెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరిహద్దుల వద్ద ఎలాంటి రక్షణ గోడ లేకపోవడం వల్ల దేశం ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. ఆయుధాల సమీకరణలో బైడెన్ చర్యలు దేశ భవిష్యత్తుకు హాని కలిగిస్తాయి. బైడెన్ అనాలోచిత నిర్ణయాలు, చర్యలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు. ఆయన మానసిక పరిస్థితి ద్వారా విపత్తు సంభవించవచ్చు’’ అంటూ వ్యాఖ్యానించారు.