అలిపిరి నుంచి తిరుమల నడక దారిలో ఇనుప కంచె ఏర్పాటు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల చిరుత దాడిలో మరణించిన బాలిక లక్షిత(6) కుటుంబానికి మరో రూ. 15 లక్షలు ఆర్థిక సాయం ఇచ్చే విషయమై ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రూ.15లక్షలు ఇచ్చినట్లు టీటీడీ, ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించాయి.