పుట్టపర్తి లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ను ఎంఈఓ ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఈఓ మాట్లాడుతూ, పట్టణంలో రాము అనే వ్యక్తి నారాయణ కోచింగ్ సెంటర్ ను నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద ఎలాంటి అనుమతులు లేవని తేలిందన్నారు. సుమారు105మంది పిల్లలు ఉన్నారని, అందులో దాదాపు 40 మంది పిల్లలు 3, 4, 5వ తరగతులు చదువుతున్నట్లు తేలిందన్నారు.