కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ అధికారులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని బుధవారం సాయంత్రం తిరుపతిలోని భూమన నివాసంలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు పాల్గొన్నారు.