ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థిని 3వ అంతస్తు నుంచి కింద పడిన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. బుధవారం సాయంత్రం విద్యార్థిని మూడో అంతస్తు నుంచి కింద పడగా తలకు తీవ్ర గాయలయ్యాయి. తల్లిదండ్రులు, స్థానికులు ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.