కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షాలు ఆశించినా సరిగ్గా కురవలేదు. గతేడాది ఆగస్టులో భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారగా.. ఈ సారి వర్షాలు లేక ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలంలో 242 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజీ మినహాయిస్తే.. 56 టీఎంసీల వరకే వినియోగించడానికి అవకాశం ఉంది. దీంతో ప్రాజెక్టుల కింద వరిసాగు చేస్తున్న రైతులు ఆవేదన చెందుతున్నారు.