సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో చేపట్టనున్న ‘ఆదిత్య L1’ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 2న(శనివారం) ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్1, PSLV-C57 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11:50 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మిషన్ ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు ఇస్రో అధికారులు తెలిపారు.