రాఖీపౌర్ణమి రోజున ఇంటిల్లిపాది శుచీ శుభ్రతను ఆచరించి దేవతారాధన చేయాలి. రాఖీ కట్టే సాయంలో మహిళలు ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. 'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి. 'రక్ష మాచల మాచల' అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి. రాఖీ కట్టిన తర్వాత సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షతలు వేయాలి. ఆ తర్వాత సోదరి తమ సోదరునికి హారతి ఇవ్వాలి. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకోవాలి.