సుప్రీంకోర్టు వెబ్ సైట్ పై ఫిషింగ్ (సైబర్ దాడి) దాడి జరిగిందని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం ఓ సర్క్యులర్ జారీ చేసింది. అచ్చం రిజిస్ట్రీ వెబ్ సైట్ లాంటి డొమైన్ తో ఫేక్ వెబ్ సైట్ క్రియట్ చేసి యూజర్ల వ్యక్తిగత సమాచారం అడుగుతున్నట్లు పేర్కొంది. అలాంటి వెబ్ సైట్ లో తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని అడ్వైజరీ జారీ చేసింది. వ్యక్తిగత డేటా చోరీ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.