చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుని కేసులో ఒడిశా హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. జిల్లా కోర్టు విధించిన 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను సమర్థిస్తూ, అదనంగా రెండేళ్లు శిక్ష విధించింది. 2019లో తల్లిని బెదిరించిన నిందితుడు 14 ఏళ్ల చెల్లెలిపై దారుణానికి పాల్పడ్డాడు. ఆమె పోలీసులను ఆశ్రయించగా కింది కోర్టు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేయగా నిందితునికి శిక్ష సరైందేనని ధర్మాసనం పేర్కొంది.