80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ సర్వేలో తేలింది. వీరిలో 55 శాతం మంది మోదీకి అత్యంత అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. 10 మంది భారతీయుల్లో ఏడుగురు ప్రపంచంలో భారత్ ప్రబల శక్తిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. 24 దేశాల్లో 30,861 మందిని సర్వే చేసినట్లు సదరు సంస్థ తెలిపింది.