బడుగుబలహీన వర్గాల పార్టీ టీడీపీ అని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీటీ నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..... బీసీలకు రాజకీయంగా అవకాశాలను కల్పించిన ఏకైన పార్టీ తెలుగుదేశమే అన్నారు. బీసీలను కిందిస్థాయి నుంచి చట్టసభలకు పంపిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. జగన్ ప్రభుత్వంలో బీసీలు పడ్డ కష్టాలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ పడలేదన్నారు. బీసీల జనాబా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్లు దక్కాలంటే ఖచ్చితంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa