టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ సెంట్రల్ ఐటీ అధికారులు ఆయనకు సెక్షన్ 153సీ ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు రూ.118 కోట్లు ముడుపులు అందినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పలు నిర్మాణ కంపెనీలకు కాంట్రాక్టులు ఇప్పించి లబ్ధి పొందినట్లు తెలుస్తోంది.