భారత భూభాగాలైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయి చిన్ను తమ భూభాగాలుగా పేర్కొంటూ చైనా ఇటీవల కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. దీనిపై ఇప్పటికే భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, తైవాన్ దేశాలు కూడా చైనాకు వ్యతిరేకంగా భారత్‌కు మద్దతుగా నిలిచాయి. చైనా కొత్త మ్యాప్‌ను ఖండిస్తూ.. అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి.