ఒకే దేశం- ఒకే ఎన్నికల(జమిలి ఎన్నికలు)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 16 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. జమిలి ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి.. కేంద్రానికి నివేదికను సమర్పించనుంది.