కేంద్ర మంత్రి కౌషల్ కిషోర్ ఇంట్లో వినయ్ శ్రీవాస్తవ్ అనే యువకుడు కాల్పుల్లో చనిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శుక్రవారం జరిగింది. బెగారియా గ్రామంలోని కేంద్ర మంత్రి ఇంట్లో ఈ ఘటన జరగగా.. మంత్రి కుమారుడి పేరుతో ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన ముగ్గురు అనుమానితులను అదుపులో తీసుకున్నామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa