నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.10కోట్ల నక్కలవాగు పనులకి ఇరిగేషన్ శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లకి ఈ నెల 5 వరకూ గడువు ఇచ్చారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాకుండానే అధికార పార్టీ నేతలు పనులు ప్రారంభించారు అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. నక్కలవాగు వద్ద సాగుతున్న పనులను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేతలు పరిశీలించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఇలాకాలో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు.