పిడుగురాళ్ల పట్నంలోని భవానీ నగర్లో గల శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుండి భక్తులు బార్లు తీరారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తులకు ఉచిత ప్రసాదాలు అందజేశారు.