ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కులం పేరుతో దూషణ.. కేసు నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 01, 2023, 01:53 PM

కులం పేరుతో దూషించడమే కాకుండా వ్యక్తిపై దాడి చేసిన సంఘటన తెనాలి మండల పరిధిలోని దంతపలూరులో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దర్శి ఏలియా పొలంలో నీళ్లు పెడుతుండగా. అదే గ్రామానికి చెందిన పెదిశెట్టి గంగయ్య దాడి చేశాడు. తాను పొలానికి నీళ్లు పెట్టుకున్న తర్వాతే పెట్టుకోవాలంటూ ఏలియాను కులం పేరుతో దూషించడమే కాకుండా దాడి చేశాడు. దీంతో బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com