టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకశ్ స్పందిస్తూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. అరెస్ట్‌లతో ప్రశ్నించే గొంతుకలను నొక్కలేరన్నారు. జగన్ అణచివేతే తమ తిరుగుబాటుకు నాంది అని అన్నారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్ జగన్ సైకో పాలనకు పరాకాష్ట అని ఆరోపించారు.