పోలీసులు తనను అరెస్ట్ చేసిన ఘటనపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. దిల్లీ నుంచి తాను విశాఖ వచ్చినట్లు తెలిపారు. ఎయిర్ పోర్ట్ వద్ద హనుమాన్ జంక్షన్ సీఐ తనను పలకరించారని అన్నారు. తనపై కేసు నమోదు చేశారని..అందుకే అరెస్టు చేశారని వివరించారు. అయితే ప్రజాస్వామ్యంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్యాయాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. ఫోన్లో అయ్యన్నను పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.