తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ సంఘాలు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. ఈనెల 10న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటలలోపు ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి తగు సూచనలు చేసింది.