మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలో శుక్రవారం మహారాష్ట్రలోని జల్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతర్వాలి గ్రామంలో జరిగిన హింసలో పోలీసులతో సహా 25 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. అయినా పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఘటనపై విచారణకు సీఎం ఏక్‌నాథ్ షిండే కమిటీని ఏర్పాటు చేశారు.